ది.25-09-16 ఆదివారం  రోజున గుడివాడలో  
రామపునర్వసు రాగనీరాజనం ఘనంగా 
జరిగింది.  సత్యనారాయణ పురం లోని ఉపద్రష్ట వారి సత్రం  లో 
కర్ణపేయంగా, అత్యంత భక్తి శ్రధలతో జరిగింది.
రామదాసాది కీర్తనలతో పాటు అమ్మవారి కీర్తనలు కూడా గానం చేశాము
రాముని కృపతో చాలా తృప్తి గా జరిగింది. 
ఈ  స్వరార్చనకు  భక్తులు, సంగీతాభిమానులు 
దాదాపు 50 మంది వచ్చినారు. ప్రసాదంగా లడ్డూలు చేయించబడ్డాయి.
ఈ ధార్మిక కార్యక్రమానికి ప్రతినెల సహకరిస్తున్న
శ్రీ అలమేలు మంగ సర్వయ్య ధార్మిక సంస్థ నిర్వాహకులకు ప్రత్యెక ధన్యవాదములు.